తండ్రి  సినిమాని రిమేక్ లో కొడుకు (రామ్‌చరణ్‌)

రామ్‌చరణ్‌, ‘నేను లోకల్‌’ చిత్ర దర్శకుడు త్రినాథరావు కాంబినేషన్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా, చిరంజీవి సినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకుడు. ఈ చిత్రం ఆధారంగా చెర్రీ-త్రినాథరావు సినిమా ఉండబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. చిరు సినిమాకు మోడ్రన్‌ వెర్షన్‌గా ఈ కథను సిద్ధం చేస్తున్నారట. ఇది ఆ సినిమా పూర్తి రీమేక్‌ కాదని, అందులోని మాతృకను మాత్రమే తీసుకుంటామని చిత్ర బృందం అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు