నితిష్ కుమర్ కు ఆవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ను బతికించండి – Ramachandra Guha

నితిష్ కుమర్ కు ఆవకాశం ఇవ్వండి కాంగ్రెస్ ను బతికించండి – Ramachandra Guha

నాయకత్వ లోపంతో జవసత్వాలను కోల్పోయిన కాంగ్రెస్‌ పార్టీకి బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ని అధ్యక్షుడిగా నియమించాలని ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ సూచించారు. అప్పుడే ప్రజాదరణ సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. స్నేహపూర్వక వాతావరణంలో జేడీయూ నేత నితీశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించాలని కోరారు. ‘సరైన నాయకుడు లేని పార్టీ కాంగ్రెస్‌.. సరైన పార్టీ లేని నాయకుడు నితీశ్‌’ అని వ్యాఖ్యానించారు. మతం, జాతి, లింగ వివక్షకు దూరంగా ఉండే స్వభావం నితీశ్‌ది. ఇటువంటి రాజకీయ నాయకులు దేశంలో అరుదుగా ఉంటారని రామచంద్ర గుహ అన్నారు.

131 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ రాబోయే రోజుల్లో భారత రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషించడం కష్టమేనని రామచంద్ర గుహ అభిప్రాయపడ్డారు. 2019 ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందని, ఈ మధ్యలో ఏమైనా మార్పులు సంభవించవచ్చన్నారు. ఏక పార్టీ వ్యవస్థ ఎప్పుడైనా దేశానికి ప్రమాదరకరమని, నెహ్రూ, ఇందిరాగాంధీ హయాంలో తేలిందన్నారు. గడిచిన 70 సంవత్సరాల్లో ద్విపార్టీ పరిపాలనతో తమిళనాడు, కేరళ, హిమాచల్‌ప్రదేశ్‌ వంటి మూడు రాష్ట్రాలు ఆర్థికంగా, సామాజికంగా అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయని చెప్పారు. ఏళ్ల తరబడి ఏక పార్టీ పరిపాలన కొనసాగిన పశ్చిమ్‌ బంగా, గుజరాత్‌లో పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. రాష్ట్రాల్లో రెండు పార్టీల వ్యవస్థ స్థిరంగా ఉంటే అత్యుత్తమంగా పాలన అందించే అవకాశముందని రామచంద్ర గుహ అభిప్రాయం వ్యక్తంచేశారు.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *