జనవరి 1న రాబోతున్న రానా

టాలీవుడ్ హీరో రానా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉన్న హీరో. బాహుబలి విలన్ గా ఎంతగానో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన రానా.. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నాడు. ఒకే చిత్రాన్ని పలు భాషల్లో తెరకెక్కిస్తూ ప్రాజెక్టు దశలోనే సేఫ్ స్టేజ్ కి తెచ్చేస్తున్నాడు. ప్రస్తుతం 1945నాటి కథతో ఓ మూవీ చేస్తున్నాడు రానా. తమిళ్ డైరెక్టర్ ప్రభు సాల్మన్ రూపొందిస్తున్న ఈ చిత్రంపై రీసెంట్ గానే అధికారిక ప్రకటన వచ్చింది.

వచ్చే ఏడాది జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పుడీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ డేట్ చెప్పేశారు. షూటింగ్ జనవరిలో ప్రారంభం కానున్నా.. జనవరి 1నే అంటే న్యూఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ ఇచ్చేయనున్నారట. తెలుగు.. తమిళ్.. హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం రానా కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలవడనుండగా.. రాజేష్ ఖన్నాకు ఈ చిత్రం ట్రిబ్యూట్ అంటున్నారు మేకర్స్. ఇందుకు కారణం.. 1971లో విడుదల అయిన హాథీ మేరా సాథీ చిత్రంలో రాజేష్ ఖన్నా పోషించిన పాత్రలో రానా కనిపించనున్నాడట.

ఇండియాలోని పలు ప్రాంతాలతో పాటు థాయ్ ల్యాండ్ లో కూడా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. వచ్చే ఏడాది దీపావళి నాటికి విడుదల చేసే టార్గెట్ డిసైడ్ చేసుకున్నారు. అలాగే ఘాజీ మాదిరిగానే ఈ పీరియాడిక్ మూవీకి కూడా చాలానే విజువల్ ఎఫెక్ట్స్ అవసరం అవుతాయని తెలుస్తోంది.

‘గాయత్రి’ రిలీజ్ డేట్ వచ్చేసింది

ఒకప్పుడు టాలీవుడ్ కలెక్షన్ కింగ్ గా కొనసాగిన మోహన్ బాబు ఆ తర్వాత స్పెషల్ పాత్రలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. గత కొంత కాలం నుంచి అయన కేవలం తనకు నచ్చిన పాత్రలనే చేస్తున్నారు. ఇక రెండేళ్ల క్రితం సినిమాలను చేయడం లేదని మోహన్ బాబు చెప్పినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా అయన రెండేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం గాయత్రి అనే సినిమాను చేస్తున్నాడు.

రాజకీయ నేపథ్యంలో సాగనున్న ఈ కథను మదన్ డైరెక్ట్ చేస్తున్నాడు. సినిమాలో మంచి కథాంశం ఉండడంతో మోహన్ బాబు ఎంతో ఇష్టంగా సినిమాను ఒప్పుకున్నారట. సినిమా మొదలుపెట్టినప్పటి నుండి ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొన్నారు. దాదాపు సినిమా షూటింగ్ ఎండింగ్ కి వచ్చేసింది. ఇక అసలు విషయానికి వస్తే సినిమా రిలీజ్ డేట్ పై గత కొన్ని రోజులుగా వస్తోన్న రూమర్స్ కి చిత్ర యూనిట్ చెక్ పెట్టింది.

సినిమాను ఫైనల్ గా ఫిబ్రవరి 9న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషయల్ ఎనౌన్సమెంట్ ఇచ్చేశారు. ఇక సినిమాలో మోహన్ బాబు యువకుడిగా ఉన్నప్పటి పాత్రను మంచు విష్ణు చేయబోతున్నాడు. శ్రియ హీరోయిన్ గా నటిస్తోంది. నిఖిలా విమలా టైటిల్ రోల్ క్యారెక్టర్ లో అలరించనుంది. బ్రహ్మానందం – అనసూయ భరద్వాజ్ వంటి నటి నటులు కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

రంగస్థలం ఫస్ట్ లుక్ రేపే రిలీజ్

ధృవ సినిమాతో హిట్టు కొట్టి దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం చాలా ఆలస్యం చేశాడనే చెప్పాలి. అయినా చరణ్ ఎంచుకున్న రంగస్థలం 1985 కథ కూడా అలాంటిది. పైగా సుకుమార్ దర్శకుడు. మధ్య మధ్యలో సైరా లాంచ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అలాగే సమంత పెళ్లి వల్ల కొంచెం షూటింగ్ ని వాయిదా వేయాల్సి వచ్చింది. ఫైనల్ గా షూటింగ్ ప్రస్తుతం చాలా స్పీడ్ గా సాగుతోంది.

ఇక అసలు పనులు కూడా ఇక్కడి నుంచే మొదలవ్వనున్నాయి. అదే ప్రమోషన్స్ కార్యక్రమాలు. సినిమా షూటింగ్ ని స్టార్ట్ చేసి చాలా కాలమే అవుతోంది. ఇంతవరకు ఫస్ట్ లుక్ లేదు. కానీ మధ్య మధ్యలో సినిమా కోసం వేసిన సెట్స్ ఫొటోస్ ని రిలీజ్ చేస్తూ.. చిత్ర యూనిట్ కొంచెం భాగనే హైప్ క్రియేట్ చేసింది. ఇక రేపటి నుంచి సినిమా రేంజ్ మరింత పెరగనుందని చెప్పవచ్చు. ఎందుకంటే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది. డిసెంబర్ 8న శుక్రవారం నాడు ఉదయం 5:30గంటలకు రంగస్థలం ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఈ న్యూస్ వైరల్ అయ్యింది.

మెగా అభిమానులు ఫస్ట్ లుక్ కోసం చాలానే ఎదురుచూస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫొటోలు ఇంతకుముందే నెట్ లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. కానీ క్లారిటీగా చూస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నారు. మరి ఈ ప్రయోగాత్మకమైన సినిమా ఫస్ట్ లుక్ ఏ స్థాయిలో అంచనాలను అందుకుంటుందో చూడాలి.

ట్విట్టర్,ఫేస్ బుక్ లో కూడా బాహుబలే

2018 సంవత్సరం మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఇక 2017 కి ముగింపు చెప్పాల్సిన టైమ్ వచ్చింది. దీంతో గడిచిన ఏడాది జ్ఞాపకాలను ఎవరికి వారు గుర్తు చేసుకుంటూ ఉంటే.. సోషల్ మీడియా కంపెనీలు మాత్రం ప్రపంచంలో ఈ ఏడాది హాట్ టాపిక్ అయిన విషయాలను గురించి లిస్టులను వదులుతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వారు హాష్ ట్యాగ్ లతో రచ్చ చేసిన టాపిక్స్ గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియాన్ ట్విట్టర్ లో బాహుబలి 2 ఎక్కువగా హాష్ ట్యాగ్ లతో రచ్చ చేసి మొదటి స్థానంలో నిలిచింది. అయితే అదే తరహాలో ఉండే రికార్డును ఫేస్ బుక్ లో కూడా బాహుబలి 2 బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఎక్కువగా చర్చించుకున్న విషయాల గురించి రీసెంట్ గా ఫేస్ బుక్ రిలీజ్ చేసిన లిస్ట్ లో బాహుబలి మొదటి స్థానం దక్కించుకుంది. 2017 ఫెస్ బుక్ సింగిల్ డే మూమెంట్ లో బాహుబలి కి ఈ గుర్తింపు దక్కడం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇకపోతే సెకండ్ మోస్ట్ ట్రేండింగ్ టాపిక్ గా తమిళనాడు లోని జల్లి కట్టు మ్యాటర్ లిస్ట్ లో ఉంది. ఇక మూడవ స్థానంలో ఛాంపియన్స్ ట్రోపి లో భాగంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సింగిల్ డే లో రికార్డ్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఫెస్ బుక్ లో ఆ మ్యాచ్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి.

మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. రీసెంట్ గా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లర్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. దీంతో అమ్మడి పెరు ఈ రికార్డ్ లిస్ట్ లో 9వ స్థానాన్ని అందుకుంది.

బన్నీ.. ఆ కొత్త కథ ఎవరికోసం?

ఈ రోజుల్లో కథల కొరత చాలానే ఉంది. సీనియర్ దర్శకులు వారి స్టైల్ లొనే సినిమాలను తీసినా సినిమా కథ మాత్రం కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. హీరోలు కూడా ఎలాంటి కథలను ఎంచుకోవలో అనే కన్ఫ్యూజన్ తో కొంచెం సతమతమవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు రోటీన్ కథలే వస్తున్నాయి. చాలా వరకు పాత కథలనే తిప్పి తిప్పి మార్చేసి తెరకెక్కిస్తున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రాబోయే సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అల్లు అర్జున్ ఏదైనా కథను ఒకే చేశాడంటే చాలు అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందనే చెప్పాలి. కథ బావుంటే కొత్త దర్శకులతో అయినా అపజయాలతో ఉన్న డైరెక్టర్స్ తో అయినా వర్క్ చేస్తాడట. ఇక అసలు విషయానికి వస్తే.. బన్నీ రీసెంట్ గా ఒక చిన్న దర్శకుడు చెప్పిన కథను కొనేసాడని తెలుస్తోంది. మంచు మనోజ్ తో మిష్టర్ నూకయ్య సినిమాను తీసిన అనిల్ కన్నెగంటి ఇటీవల బన్నీకి ఒక డీఫెరెంట్ కథను చెప్పడంతో వెంటనే కోటికి పైగానే రెమ్యునరేషన్ ఇచ్చి హక్కులను దక్కించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఆ కథలో స్టైలిష్ స్టార్ నటిస్తాడా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎవరు నటిస్తారు అన్నది కూడా సస్పెన్స్.

అయితే ఆ కథను మెగా హీరోల కోసం కొన్నాడా? లేక తమ్ముడు శిరీష్ కోసం కొన్నాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

నాని కూడా చాలా పాపులర్,పోటీ ఉండదు-నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున మీడియాతో కూర్చుంటే తొందరగా ఏ ప్రశ్నకైనా చాలా స్వీట్ గా ఆన్సర్ ఇస్తుంటారు. తనకు సంబంధించిన ప్రతి సినిమా గురించి నాగ్ చాలా బాధ్యతగా ప్రమోషన్స్ చేస్తూ.. ఇతర సినిమాలపై కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నాగ్ అఖిల్ సెకండ్ మూవీ ‘హలో’ కోసం ప్రచారాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే హలో రిలీజ్ అవుతున్నందుకు కొంచెం టెన్షన్ గానే ఉంది అని చెప్పిన నాగ్ సినిమా మీద మాత్రం చాలా నమ్మకంగా ఉందని తప్పకుండా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం కూడా ఉందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక హలో సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని MCA కూడా ఒక రోజు ముందుగా రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్న ప్రశ్నకు నాగ్ చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తూ.. నాగ్ పోటీ కాదు అని చెప్పకనే చెప్పారు.

అంతే కాకుండా ఒక వివరణ కూడా ఇచ్చాడు. నాగ్ మాట్లాడుతూ.. జనరల్ గా పోటీ ఉండదు అనుకుంటున్నా. నాని కూడా చాలా పాపులర్. పండక్కి అయిదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీ ఎవరని అనుకోవడం లేదు. అయినా మన తెలుగు స్టేట్స్ లో సరిపోయే థియేటర్స్ చాలానే ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనుకుంటున్నా.. అని నాగ్ సింపుల్ గా నాని పోటీ కాదు అని చెప్పేశారు.

భారతదేశంలో అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది-బాహుబలి

కొందరు గ్రామస్థులు ఒక నది మధ్యలో ఒక శిశువు బాలుడు అద్భుతాన్ని చూస్తారు.వారు అతనిని తమ సొంతంగా పెంచుతారు.శివ (ప్రభాస్) అనే పేరు పెడ్తారు.అతని గత కాలం అతడిని వెంటాడే వరకు ఒక సాహసవంతుడైన సామాన్య వ్యక్తిగా పెరుగుతూ మారుతారు.అతను మహీష్మతి రాజ్యానికి వారసుడు. మహారాణి దేవసేన(అనుష్క షెట్టి) కుమారుడు అమరేంద్ర బాహుబలి (రెండు పాత్రలో ప్రభాస్),అతను తన తల్లిదండ్రులను హింసించి బలవంతంగా వారి రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్న దుష్ట రాజు భల్లాలా దేవా (రానా దగ్గబాటి) తో పోరాడడానికి మళ్లీ తిరిగి వస్తాడు.
నోటిసులు వచ్చిన మాట వాస్తవం కాని నేను ఏ తప్పు చెయలేదు- హీరో నవదీప్

టాలీవుడ్‌తోపాటు రెండు తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇప్పటికే టాలీవుడ్ సెలబ్రిటీలకు నోటీసులు అందించింది. అయితే తమకు ఎలాంటి సంబంధంలేకున్నా తమ పేర్లు బయటపెట్టడాన్ని కొంతమంది తప్పుబడుతుంటే మరికొంతమంది నోటీసులు అందిన మాటను ఒప్పుకుంటున్నారు.

సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో తనకు నోటీసులు అందాయని, పోలీసుల విచారణలో పూర్తిగా సహకరిస్తానని చెబుతున్నాడు టాలీవుడ్ హీరో నవదీప్. నోటీసులు వచ్చిన మాట నిజమే కానీ తాను ఏ తప్పు చేయలేదని, అకారణంగా ఊహాగానాలతో తమ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నారని బాధపడుతున్నాడు. అంతేగాక కెల్విన్‌తో సంబంధాలు అంటున్నారని, కానీ ఆ కెల్విన్ ఎవరో తనకు నిజంగానే తెలియదని ఈ డ్రగ్స్ కేసులో మొత్తం సెలబ్రిటీలే చేశారంటూ ప్రచారం చేయడంతో తమకు చాలా ఇబ్బందికరంగా మారిందని నవదీప్ అంటున్నాడు.

అంతేగాక చిన్నప్పుడు చేసిన తప్పులకు ఇప్పటికే నా జీవితం సాఫ్ట్ టార్గెట్‌గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లాంటి విషయాల్లో తప్పులు చేసి సరిదిద్దుకున్నానని, కానీ డ్రగ్స్‌లాంటి పెద్ద కేసుల్లో ఇప్పటివరకు తనపై కనీసం ఆరోపణలు కూడా రాలేదన్న విషయం అందరికీ తెలుసన్నారు నవదీప్. అయితే ఇటీవల ఓ రాంగ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌తో కలిసి పని చేయడంవల్లే తనను పిలిచి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు. అంతేగాక జనరల్ కౌన్సెలింగ్ కోసం నోటీసులు అందజేశారని విచారణకు సహకరించి పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఇంటికి వస్తానన్నారు నవదీప్. అప్పటివరకు అనవసర ప్రచారం చేసి తమను ఇబ్బంది పెట్టొదని అంటూ twitter ద్వారా అందరినీ కోరాడు నవదీప్.