డీ.జే. సినిమా తరువాత బన్ని చేస్తున్న  సినిమా నా పేరు సూర్య

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ తన ప్రతి చిత్రంలోనూ ఓ కొత్తదనాన్ని చూపే ప్రయత్నం చేస్తుంటారు. పాత్ర పాత్రకూ గెటప్‌ మారుస్తూ ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంటారు. ఇటీవల విడుదలైన ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్‌’లోనూ ఆయన కొత్త తరహాలో కనిపించారు. బ్రాహ్మణ యువకుడిగా ఇది వరకు ఎన్నడూ లేనివిధంగా కనిపించారు. ఇందులోని తన పాత్ర కోసం బన్ని కొన్ని రోజులపాటు బ్రాహ్మణుల దగ్గర శిక్షణ తీసుకున్నారు. బ్రాహ్మణ యువకుడి హావభావాలను అడిగి తెలుసుకున్నారు.
‘డీజే’ తర్వాత బన్ని నటిస్తున్న చిత్రం ‘నా పేరు సూర్య’. ఈ చిత్రంలో ఆయన మిలిటరీ అధికారిగా కనిపించబోతున్నారు. కాగా తన పాత్రకు తగ్గట్టు దేహదారుఢ్యాన్ని మార్చుకోవడానికి ఆయన అమెరికా వెళ్తున్నారట. దాదాపు నెల రోజులు ఆయన అక్కడ శిక్షణ తీసుకోనున్నట్లు చిత్ర వర్గాల సమాచారం.
వక్కంతం వంశీ ‘నా పేరు సూర్య’కు దర్శకత్వం వహిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. అను ఇమ్మాన్యుయెల్‌ కథానాయిక. విశాల్‌-శేఖర్‌ స్వరాలు అందిస్తున్నారు.

పూరి దర్షకత్వంలో పైసా వసూల్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘పైసా వసూల్‌’. శ్రియ నాయిక. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. వి.ఆనంద ప్రసాద్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ‘‘బాలకృష్ణగారితో పనిచేయడం ఆనందంగా, గర్వంగా ఉంది. నా కెరీర్‌లో ఇదో మర్చిపోలేని చిత్రం అవుతుంది. ఆయన పాత్రలో లీనం అవుతున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అభిమానులు ఆశించే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి.
తండ్రి  సినిమాని రిమేక్ లో కొడుకు (రామ్‌చరణ్‌)

రామ్‌చరణ్‌, ‘నేను లోకల్‌’ చిత్ర దర్శకుడు త్రినాథరావు కాంబినేషన్లో ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. కాగా, చిరంజీవి సినీ కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకుడు. ఈ చిత్రం ఆధారంగా చెర్రీ-త్రినాథరావు సినిమా ఉండబోతున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. చిరు సినిమాకు మోడ్రన్‌ వెర్షన్‌గా ఈ కథను సిద్ధం చేస్తున్నారట. ఇది ఆ సినిమా పూర్తి రీమేక్‌ కాదని, అందులోని మాతృకను మాత్రమే తీసుకుంటామని చిత్ర బృందం అన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’లో నటిస్తున్నారు. సుకుమార్‌ దర్శకుడు. సమంత కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. 1985 నేపథ్యంలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు