‘జవాన్’ మూవీ రివ్యూ

‘జవాన్’ మూవీ రివ్యూ
నటీనటులు: సాయిధరమ్ తేజ్-మెహ్రీన్-ప్రసన్న-కోట శ్రీనివాసరావు-జయప్రకాష్-సుబ్బరాజు-ఈశ్వరీరావు-నాగబాబు-సత్యం రాజేష్-అనీష్ కురువిల్లా తదితరులు
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: కె.వి.గుహన్
నిర్మాత: కృష్ణ
రచన-దర్శకత్వం: బి.వి.ఎస్.రవి

వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్.. దర్శకుడిగా తొలి సినిమా ‘వాంటెడ్’తో చేదు అనుభవం ఎదుర్కొన్న బి.వి.ఎస్.రవి కలిసి చేసిన సినిమా ‘జవాన్’. టీజర్.. ట్రైలర్ తో ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: జై (సాయిధరమ్ తేజ్) కుటుంబం కంటే దేశం గొప్పదని భావించే కుర్రాడు. ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొందిన అతడికి నరనరాన దేశభక్తి ఉప్పొంగుతూ ఉంటుంది. దేశానికి సేవ చేసేందుకు డీఆర్డీవోలో ఉద్యోగం సాధించాలని కష్టపడుతుంటాడు. ఇక జైతో పాటు స్కూల్లో చదువుకున్న కేశవ (ప్రసన్న) అతడికి పూర్తి విరుద్ధం. అతడి డబ్బే అన్నింటికంటే ముఖ్యం. అందుకోసం ఏమైనా చేస్తాడు. దేశాన్ని దెబ్బ తీయడానికైనా సిద్ధపడతాడు. అతను టెర్రరిస్టులతో చేతులు కలిపి డీఆర్డీవో దేశం కోసం కొత్తగా తయారు చేసిన ప్రమాదకర ఆయుధాన్ని దొంగిలించడానికి పన్నాగం పన్నుతాడు. ఆ ప్రయత్నానికి జై అడ్డు పడతాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య పోరు మొదలవుతుంది. ఈ పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: కుటుంబం ఏమైనా పర్వాలేదు సొసైటీ కోసం బతకాలనే హీరో ఒకవైపు.. సొసైటీ ఏమైనా పర్వాలేదు తన ప్రయోజనాలే ముఖ్యమనుకునే విలన్ ఓవైపు.. ఈ ఇద్దరి మధ్య క్యాట్ అండ్ మౌస్ గేమ్ నేపథ్యంలో సాగే సినిమా ‘జవాన్’. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మధ్య ఇది కొంచెం భిన్నమైన సినిమానే. కానీ ఇది కొత్త తరహా సినిమా మాత్రం కాదు. ‘జవాన్’ చూస్తున్నంతసేపూ ‘తుపాకి’.. ‘ధృవ’లతో పాటు గౌతమ్ మీనన్ సినిమా ‘ఎంతవాడు గాని’ లాంటివి గుర్తుకు రాక మానవు. మామూలుగా చూస్తే ‘జవాన్’ ఎలా అనిపించేదో కానీ.. చాలా గ్రిప్పింగ్ గా.. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించేలా సాగిన పై సినిమాలు చూశాక ‘జవాన్’ ఓ సగటు సినిమాలా అనిపిస్తుందతే.

మొదట్నుంచి కమర్షియల్ అంశాలకు పెద్ద పీట వేస్తూ సినిమాలు చేసిన రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్ కూడా ‘ధృవ’ సినిమాకు వచ్చేసరికి పూర్తిగా మారిపోయాడు. ఇలాంటి సినిమాలకు ఏ డీవియేషన్లూ ఉండొద్దని భావించి.. కమర్షియల్ హంగులకు దూరంగా ఉన్నాడు. కథతో పాటే సాగిపోయాడు. కానీ ‘జవాన్’ టీం మాత్రం అలా చేయలేదు. కథ.. పాత్రల విషయంలో సిన్సియారిటీ చూపించినప్పటికీ.. కమర్షియల్ హంగుల కోసం తాపత్రయపడింది. కథ సీరియస్ గా.. ఆసక్తికరంగా ముందుకు సాగుతున్నపుడు సీన్లోకి హీరోయిన్ని దిగుతుంది. ఇద్దరూ కలిసి ఒకసారి డ్యూయెట్ కోసం ఫారిన్ లొకేషన్ కు వెళ్లిపోతారు. ఇంకోసారి మాస్ సాంగ్ వేసుకుంటారు. ప్రేక్షకులు ఆ మూడ్ నుంచి బయటికి వచ్చి మళ్లీ కథలోకి ఇన్వాల్వ్ కావడానికి కొంచెం టైం పడుతుంది. హీరో-విలన్ మధ్య ఎత్తులు పైఎత్తుల మీద కథను నడపాలనుకున్నపుడు.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేకెత్తించాలనుకున్నపుడు.. అదే సినిమాకు ఆకర్షణగా భావించినపుడు.. ఇలాంటి హంగుల కోసం వెంపర్లాట ఎందుకు?

ఆ పోలికలు.. ఈ డీవియేషన్ల సంగతి వదిలేసి.. మిగతా విషయాల్లోకి వస్తే.. 135 నిమిషాల నిడివిలో ‘జవాన్’ చాలా వరకు ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది. తన కుటుంబం నాశనమైపోయినా పర్వాలేదు.. దేశం బాగుండాలని కోరుకునే కుర్రాడిగా హీరో పాత్రను తీర్చిదిద్దిన విధానం ‘జవాన్’కు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రకు సాయిధరమ్ తేజ్ చాలా బాగా సూటయ్యాడు కూడా. విలన్ పాత్ర కూడా మొదట్లో బాగానే అనిపిస్తుంది. ఈ రెండు పాత్రల పరంగా వైరుధ్యం.. ఇద్దరి మధ్య సంఘర్షణకు దారి తీసే పాయింట్ కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. హీరో పాత్రను ఓ బిల్డప్ ఇచ్చి మొదట్లో పైకి లేపి.. తర్వాత కింద పడేయకుండా.. హడావుడి లేకుండా సింపుల్ గా మొదలుపెట్టి.. దాన్ని బిల్డ్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో పాత్రలోని సిన్సియారిటీని చక్కగా ఎస్టాబ్లిష్ చేశాడు దర్శకుడు. కాబట్టే ద్వితీయార్ధంలో దేశం గురించి.. దేశభక్తి గురించి డైలాగులు చెబుతుంటే ఎబ్బెట్టుగా అనిపించదు. అవి హృదయాన్ని హత్తుకునేలా.. ఆలోపించజేసేలా ఉంటాయి.

హీరో-విలన్.. పాత్రల పరిచయం తర్వాత ఇద్దరూ ఎవరికి వారుగా రంగంలోకి దిగి తమ లక్ష్యం కోసం సాగే క్రమంలో వచ్చే సన్నివేశాల్ని ఆసక్తికరంగానే నడిపాడు దర్శకుడు. విలన్ మిషన్ని హీరో దెబ్బ తీసే సీన్ మాస్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ ఇస్తుంది. కొంచెం సినిమాటిగ్గా అనిపించినప్పటికీ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. ప్రథమార్ధం ద్వితీయార్ధం మీద అంచనాలు పెట్టుకునేలా చేస్తుంది. కానీ రెండో అర్ధంలో హీరో-విలన్ మధ్య మైండ్ గేమ్ అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. ఒక దశ దాటాక విలన్ పాత్రను తేల్చేశారు. విలన్ హీరో పక్కనే ఉండటం అన్నది కొత్త పాయింటే అయినా.. ఇద్దరి మధ్య ఎత్తులు పైఎత్తుల్లో అంత కొత్తదనం.. ఉత్కంఠ లేకపోయింది. ఇక్కడ సినిమా సాగతీతగా అనిపిస్తుంది. అందులోనూ ప్రి క్లైమాక్స్ దగ్గర్నుంచి హడావుడిగా ఏదో అలా లాగించేసిన ఫీలింగ్ కలుగుతుంది.

విలన్ గుట్టును హీరో పట్టేసే సీన్ అంతగా పేలలేదు. క్లైమాక్స్ కూడా అలాగే తయారైంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్ని ఇంత సింపుల్ గా తేల్చేయడం ప్రేక్షకులకు రుచించదు. ఇలాంటి సన్నివేశాల్లో దర్శకుడి నుంచి మరింత బ్రిలియన్స్ ఆశిస్తారు ప్రేక్షకులు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో మాదిరి ఈ సన్నివేశాల్ని డీల్ చేశాడు రవి. ఇక డీఆర్డీవో నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కూడా మామూలుగా అనిపిస్తాయి. ఇంకాస్త డీటైల్ గా.. కన్విన్సింగ్ గా ఈ సన్నివేశాలు తీర్చిదిద్దాల్సింది. దేశ అమ్ముల పొదిలో ఒక పెద్ద అస్త్రాన్ని చేరుస్తున్నపుడు దాన్ని మామూలుగా ఒక కంటైనర్ వెహికల్లో పంపించడం.. దాని మీద విలన్ అటాక్ చేయడం అన్నది అసహజంగా అనిపిస్తుంది. ఈ ప్రతికూలతల్ని పక్కన పెడితే.. చాలా వరకు బోర్ కొట్టించకుండా సాగిపోవడం ‘జవాన్’కు ఉన్న ప్లస్ పాయింట్. తేజు-రవిలకు మరీ గొప్ప ఫలితాన్నివ్వకపోయినా.. వాళ్లిద్దరి గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా మెరుగ్గానే అనిపిస్తుంది.

నటీనటులు: సాయిధరమ్ తేజ్ కొత్తగా కనిపిస్తాడు ‘జవాన్’లో. అతడి లుక్.. నటన అన్నీ మెరుగయ్యాయి. ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో తేజుకు ఇది బెస్ట్ పెర్ఫామెన్స్ అని చెప్పొచ్చు. ఎక్కడా అతి లేకుండా పద్ధతిగా పాత్రకు తగ్గట్లు సిన్సియర్ గా నటించాడతను. తేజ్ నటనలో పరిణతి కనిపిస్తుంది. సినిమాలో పాటలు ఏమాత్రం సింక్ అయ్యాయి అన్నది పక్కన పెడితే అభిమానులకు నచ్చేలా డ్యాన్సులు కూడా అదరగొట్టాడు తేజ్. విలన్ పాత్ర అనుకున్నంత బాగా లేకపోయినప్పటికీ ప్రసన్న నటనకు వంకలు పెట్టడానికేమీ లేదు. అతను కూడా సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. హీరోయిన్ మెహ్రీన్ ఓకే. అందంగా.. బబ్లీగా కనిపించింది. పాటల్లో.. ముఖ్యంగా ‘బుగ్గంచున’లో చాలా గ్లామరస్ గా కనిపించి కుర్రాళ్లను అలరించింది. కోట శ్రీనివాసరావు.. సుబ్బరాజు.. జయప్రకాష్.. నాగబాబు.. వీళ్లంతా పాత్రలకు తగ్గట్లు నటించారు.

సాంకేతికవర్గం: తమన్ సంగీతం ‘జవాన్’కు పెద్ద ప్లస్. పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణ. తమన్ కెరీర్లో బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సినిమాల్లో ‘జవాన్’ ఒకటిగా నిలుస్తుంది. చాలా సన్నివేశాల్ని నేపథ్య సంగీతంతో నిలబెట్టాడు తమన్. కె.వి.గుహన్ ఛాయాగ్రహణం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బి.వి.ఎస్.రవి రచయితగా.. దర్శకుడిగా యావరేజ్ మార్కులు వేయించుకుంటాడు. అతను ఎంచుకున్న కథ ఓకే. హీరో పాత్రను బాగా తీర్చిదిద్దాడు. కొన్ని చోట్ల మంచి డైలాగులు రాశాడు. ముఖ్యంగా దేశభక్తితో ముడిపడ్డ మాటలు బాగున్నాయి. స్క్రీన్ ప్లే మరింత బిగువుగా రాసుకోవాల్సింది. ద్వితీయార్ధం.. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో మరింత కసరత్తు చేసి ఉంటే ‘జవాన్’ రవికి మెమొరబుల్ ఫిలిం అయ్యుండేదే.

చివరగా: జవాన్.. జస్ట్ ఓకే థ్రిల్లర్!

రేటింగ్- 2.75/5

ట్విట్టర్,ఫేస్ బుక్ లో కూడా బాహుబలే

2018 సంవత్సరం మరికొన్ని రోజుల్లో మొదలు కానుంది. ఇక 2017 కి ముగింపు చెప్పాల్సిన టైమ్ వచ్చింది. దీంతో గడిచిన ఏడాది జ్ఞాపకాలను ఎవరికి వారు గుర్తు చేసుకుంటూ ఉంటే.. సోషల్ మీడియా కంపెనీలు మాత్రం ప్రపంచంలో ఈ ఏడాది హాట్ టాపిక్ అయిన విషయాలను గురించి లిస్టులను వదులుతున్నాయి. ఇప్పటికే ట్విట్టర్ వారు హాష్ ట్యాగ్ లతో రచ్చ చేసిన టాపిక్స్ గురించి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇండియాన్ ట్విట్టర్ లో బాహుబలి 2 ఎక్కువగా హాష్ ట్యాగ్ లతో రచ్చ చేసి మొదటి స్థానంలో నిలిచింది. అయితే అదే తరహాలో ఉండే రికార్డును ఫేస్ బుక్ లో కూడా బాహుబలి 2 బద్దలు కొట్టింది. ఈ ఏడాది ఎక్కువగా చర్చించుకున్న విషయాల గురించి రీసెంట్ గా ఫేస్ బుక్ రిలీజ్ చేసిన లిస్ట్ లో బాహుబలి మొదటి స్థానం దక్కించుకుంది. 2017 ఫెస్ బుక్ సింగిల్ డే మూమెంట్ లో బాహుబలి కి ఈ గుర్తింపు దక్కడం నిజంగా చాలా స్పెషల్ అని చెప్పాలి. ఇకపోతే సెకండ్ మోస్ట్ ట్రేండింగ్ టాపిక్ గా తమిళనాడు లోని జల్లి కట్టు మ్యాటర్ లిస్ట్ లో ఉంది. ఇక మూడవ స్థానంలో ఛాంపియన్స్ ట్రోపి లో భాగంగా ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సింగిల్ డే లో రికార్డ్ స్థాయిలో చర్చలు జరిగాయి. ఫెస్ బుక్ లో ఆ మ్యాచ్ ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసిందని చెప్పాలి.

మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే.. రీసెంట్ గా మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లర్ ఎంత హాట్ టాపిక్ అయ్యిందో తెలిసిందే. దీంతో అమ్మడి పెరు ఈ రికార్డ్ లిస్ట్ లో 9వ స్థానాన్ని అందుకుంది.

బన్నీ.. ఆ కొత్త కథ ఎవరికోసం?

ఈ రోజుల్లో కథల కొరత చాలానే ఉంది. సీనియర్ దర్శకులు వారి స్టైల్ లొనే సినిమాలను తీసినా సినిమా కథ మాత్రం కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు చూస్తున్నారు. హీరోలు కూడా ఎలాంటి కథలను ఎంచుకోవలో అనే కన్ఫ్యూజన్ తో కొంచెం సతమతమవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు రోటీన్ కథలే వస్తున్నాయి. చాలా వరకు పాత కథలనే తిప్పి తిప్పి మార్చేసి తెరకెక్కిస్తున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం రాబోయే సినిమాల కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

అల్లు అర్జున్ ఏదైనా కథను ఒకే చేశాడంటే చాలు అందులో ఎదో ఒక కొత్త పాయింట్ ఉంటుందనే చెప్పాలి. కథ బావుంటే కొత్త దర్శకులతో అయినా అపజయాలతో ఉన్న డైరెక్టర్స్ తో అయినా వర్క్ చేస్తాడట. ఇక అసలు విషయానికి వస్తే.. బన్నీ రీసెంట్ గా ఒక చిన్న దర్శకుడు చెప్పిన కథను కొనేసాడని తెలుస్తోంది. మంచు మనోజ్ తో మిష్టర్ నూకయ్య సినిమాను తీసిన అనిల్ కన్నెగంటి ఇటీవల బన్నీకి ఒక డీఫెరెంట్ కథను చెప్పడంతో వెంటనే కోటికి పైగానే రెమ్యునరేషన్ ఇచ్చి హక్కులను దక్కించుకున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఆ కథలో స్టైలిష్ స్టార్ నటిస్తాడా అన్నది ఇంకా ఫిక్స్ కాలేదు. ఎవరు నటిస్తారు అన్నది కూడా సస్పెన్స్.

అయితే ఆ కథను మెగా హీరోల కోసం కొన్నాడా? లేక తమ్ముడు శిరీష్ కోసం కొన్నాడా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. బన్నీ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో నా పేరు సూర్య అనే సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

నాని కూడా చాలా పాపులర్,పోటీ ఉండదు-నాగ్

టాలీవుడ్ కింగ్ నాగార్జున మీడియాతో కూర్చుంటే తొందరగా ఏ ప్రశ్నకైనా చాలా స్వీట్ గా ఆన్సర్ ఇస్తుంటారు. తనకు సంబంధించిన ప్రతి సినిమా గురించి నాగ్ చాలా బాధ్యతగా ప్రమోషన్స్ చేస్తూ.. ఇతర సినిమాలపై కూడా చాలా పాజిటివ్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం నాగ్ అఖిల్ సెకండ్ మూవీ ‘హలో’ కోసం ప్రచారాలను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే హలో రిలీజ్ అవుతున్నందుకు కొంచెం టెన్షన్ గానే ఉంది అని చెప్పిన నాగ్ సినిమా మీద మాత్రం చాలా నమ్మకంగా ఉందని తప్పకుండా అందరికి నచ్చుతుంది అనే నమ్మకం కూడా ఉందని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఇక హలో సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కాబోతోన్న సంగతి తెలిసిందే. అలాగే నాని MCA కూడా ఒక రోజు ముందుగా రిలీజ్ కాబోతోంది. దీంతో సినిమాకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అన్న ప్రశ్నకు నాగ్ చాలా కూల్ గా ఆన్సర్ ఇస్తూ.. నాగ్ పోటీ కాదు అని చెప్పకనే చెప్పారు.

అంతే కాకుండా ఒక వివరణ కూడా ఇచ్చాడు. నాగ్ మాట్లాడుతూ.. జనరల్ గా పోటీ ఉండదు అనుకుంటున్నా. నాని కూడా చాలా పాపులర్. పండక్కి అయిదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీ ఎవరని అనుకోవడం లేదు. అయినా మన తెలుగు స్టేట్స్ లో సరిపోయే థియేటర్స్ చాలానే ఉన్నాయి. పెద్ద ప్రాబ్లమ్ ఏమి ఉండదు అనుకుంటున్నా.. అని నాగ్ సింపుల్ గా నాని పోటీ కాదు అని చెప్పేశారు.

ఒక అందమైన కుటుంబాన్ని నిర్మించిన చిత్రం అ ఆ…

 

అనాసుయ (సమంతా) నరేష్ మరియు నదియ యొక్క ఏకైక కుమార్తె. ఆమె జీవితంలో ఆమె తల్లిదండ్రులు గొప్పగా వివాహం చేయాలని అనుకుంటారు.ఈ వివాహం అనసూయ కి ఇస్టముండదు.ఆమె తండ్రి సలహా ప్రకారం ఆమె అత్తమామల ఇంటికి కొంత సమయం గడిపేందుకు వెళుతుంది.
ఆమె ఆనంద్ (నితిన్) ను కలుసుకుంటూ, అతనితో ప్రేమలో పడుతది. ఆనంద్ తన నాగల్ వల్లీ (అనుపమ పరమేశ్వరన్) ను పెళ్లి చేసుకునేటప్పుడు అతని వ్యక్తిగత సమస్యల కారణంగా కథలో ట్విస్ట్ పుడుతుంది.
అనాసుయ కోపంతో ఉన్న తల్లితో మరియు ఆనంద్ ప్రేమను ఎలా గెలుచుకునుంటుందో, నాగవళ్లితో ఎలా వ్యవహరిస్తుందో కథ మిగిలినది.

ద్వారకా ఒక ఆసక్తికరమైన కధాంశం మరియు ఒక కదిలిపోయే అరుదైన స్క్రీన్ ప్లే ఉంది.

ఎర్ర సీను(విజయ్ దేవరకొండ) ఒక దొంగ,అతను దొంగతనం చేస్తూ అనుసంధానిత కారణంగా దేవుడు అనుకుంటారు, అందువలన అతనిని కృష్నానంద స్వామిగా మారుస్తారు.దక్షిన వలె ప్రవహిస్తున్న డబ్బు కోసం దురాశతో అలానే ఉంటాడు.అతను అక్కడ ఉండడం ఇష్టం లేక అక్కడి నుండి వెళ్లిపోవాలని అనుకుంటాడు.ఇంతలో వసుధ (పూజా జావెరీ)ను తన దొంగతనం రోజులలో అతను చూస్తాడు,అప్పుడు ఆ అమ్మాయి తనను పూజించడానినికి తిరిగి వస్తది మరియు అతను ఆమె కోసం తిరిగి ఉండాలని నిర్ణయించుకుంటాడు.తన అనుచరుడు వారి మార్గాల నుండి ఒక కొత్త ఆలోచనలకు మారుస్తాడు, మంచి వాడు అవుతాడు మరియు అతని ప్రేమను గెలుస్తాడు.
రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన సినిమా ‘ధృవ’.

రామ్ చరణ్ కొత్తగా నియమించబడిన ఐపిఎస్ అధికారి ధ్రువ పాత్రలో నటించారు. అతను శిక్షణాకాలంలో సమయాన్ని గడపడానికి మరియు పోలీసులను నేరస్థులను పట్టుకోవటానికి సహాయం చేయటానికి నిశ్శబ్దంగా వెళ్ళిపోతున్న శిక్షణా కాలములో అతను ఇష్టపడే పోలీసు అధికారులతో స్నేహం చేస్తాడు.ధ్రువ యజమాని కుమార్తె ఇషిక(రకుల్) అతన్ని ప్రేమిస్తది, కానీ అతను ప్రేమలో ఆసక్తి చూపించడు. ఆమె అతనిని ఎదుర్కొంటుంది మరియు కాలానుగుణంగా తన అదృశ్యం గురించి అడిగినప్పుడు, ధ్రువ అతను వార్తాపత్రిక నివేదికల ఆధారంగా వివిధ నేరస్థులను వేటాడేందుకు ప్రయత్నించే రహస్యం నుండి బయటపడ్డాడు.
విజయదేవరకొండ షాలిని పాండే కలిసి నటించిన చిత్రం ఇది (అర్జున్ రెడ్డి)

అర్జున్ రెడ్డి (విజయ్ దేవరకొండ) ఒక వైద్య నిపుణుడు, అతను విద్యావేత్తలలో చాలా తెలివైనవాడు – అతని ఏకైక సమస్య అతని అనియంత్రిత నిగ్రహము. అతను విద్యార్థి పోరాటంలో పాల్గొంటాడు మరియు కళాశాల యొక్క ప్రధాని అతనిని క్షమాపణ పత్రం వ్రాసి వదిలివెయ్యమని అడుగుతాడు. అర్జున్ ఈ కళాశాలను విడిచిపెట్టలాని అనుకుంటాడు, కానీ ప్రీతి (శాలిని పాండే) లోని కళాశాలలో తన అభిమానాన్ని చూసుకుంటాడు. ఇది అతనికి మొదటి చూపులో ప్రేమ మరియు అతను ఆమె కోసం ఉండడానికి నిర్ణయించుకుంటుంది. చివరికి, ఆమె తన భావాలను పరస్పరం పంచుకుంటుంది మరియు వారు మానసికంగా మరియు శారీరకంగా పాల్గొంటారు.

అర్జున్ ప్రీతి తల్లిదండ్రులను పెళ్లి చేసుకుంట అని అడిగినప్పుడు వారు ఒప్పుకోకపొవటంతో అర్జున్ గొడవ చేస్తాడు. ఇంతలో, అర్జున్ యొక్క తల్లిదండ్రులు అతని అన్న (కామరాజు) వివాహంతో బిజీగా ఉన్నారు. ప్రీతి తల్లిదండ్రులను ఒప్పించడానికి అర్జున్ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి మరియు ఆమె వేరొకరితో పెళ్లి చేసుకుంటుంది.దీని కారణంగా అర్జున్ మందుకు బానిస అయిపొతాడు.

పవన్ కళ్యాన్ “కాటమరాయుడు”ల మన ముందుకు వచ్చాడు.

రాయుడు(పవన్ కళ్యాణ్) మరియు అతని నలుగురు సోదరులు వారి గ్రామంలో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారు.ఒక అమ్మాయి తన కుటుంబంలోకి ప్రవేశిస్తే తనకు మరియు తన సోదరులకు మధ్య సమస్యలు తలెత్తుతాయని అతను భావిస్తున్నందున కఠినమైన మరియు తీవ్రమైన స్తితిలో రాయుడు పెళ్లి చేసుకోడు. తన నలుగురు సోదరులు ప్రేమలో ఉంటారు మరియు త్వరలో పెళ్లి చేసుకోవాలని కోరుకుంటారు.వారు వివాహం చేసుకోవాలంటే, వారిలో పెద్దవారైనందున రాయుడు మొదటిగా పెళ్లి చేసుకోవాలని వారు తెలుసుకుంటారు.వారందరూ కలిసి,ఒక ప్రణాళిక తయారు చేసి అవంతి(శృతి హసన్)ని రోజు ఏదో ఒకవిధంగా వారు కలుసుకుంటారు.
                            కాటమరాయుడు, సమస్యలను పరిష్కరించడానికి హింసాకాండను ఉపయోగించుకుంటున్న వ్యక్తి,అవంతికను వివాహం చేసుకోవాలని , అతను తన మార్గాన్ని మార్చుకోవాలని కోరుకుంటాడు. అతను తన క్రూరమైన లక్షణాలను నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు, అతని భార్య యొక్క బంధువులు ప్రమాదాలను ఎదుర్కొంటాడు.