కేటీఆర్‌.. దిగ్విజయ్‌ మళ్లీ ట్విటర్‌ వార్‌

కేటీఆర్‌.. దిగ్విజయ్‌ మళ్లీ ట్విటర్‌ వార్‌

తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ మరోసారి మాటల యుద్ధానికి దిగారు. ఇటీవల సంచలనంగా మారిన డ్రగ్స్‌ వ్యవహారంపై స్పందించిన దిగ్విజయ్‌.. తెరాసతో సంబంధాలున్న వ్యక్తులను విచారిస్తారో? లేదో? అంటూ వివాదాస్పద ట్వీట్‌ చేశారు. డిగ్గీరాజా వ్యాఖ్యలపై అసహనం వ్యక్తం చేసిన కేటీఆర్‌.. వయసుకు తగిన పనులు చూసుకోవాలంటూ దీటుగా సమాధానమిచ్చారు. అసలేం జరిగిందంటే..

తెలంగాణలో భారీ డ్రగ్స్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో సినీ ప్రముఖులను సిట్‌ నిన్నటి నుంచి విచారిస్తోంది. ఈ విషయంపై దిగ్విజయ్‌ స్పందిస్తూ.. ‘తెలంగాణలో అతిపెద్ద డ్రగ్స్‌ కుంభకోణం. ప్రభావితం చేయగల తెరాస నేతల మిత్రులు కూడా ఉన్నారు. మరి వారిని రక్షిస్తారా..? విచారిస్తారా? వేచి చూడాలి’ అంటూ ట్వీట్‌ చేశారు. కాగా.. దిగ్విజయ్‌ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ తీవ్రంగా స్పందించారు. ‘మీరు పూర్తిగా ఓడిపోయారు సర్‌. ఇక విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. వయసుకు తగిన పనులు చూసుకుంటే మంచిది. అయితే ఇప్పటికైనా తెలంగాణను సరిగ్గా రాయడం నేర్చుకున్నందుకు సంతోషం’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

గతంలోనూ కేటీఆర్‌.. దిగ్విజయ మధ్య ఇలాంటి మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణ పోలీసులపై అప్పట్లో దిగ్విజయ్‌ సింగ్‌ వివాదాస్ప వ్యాఖ్యలు చేయడంతో కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *